ఊపిరి పీల్చుకున్న భారత వాయుసేన..!

| Edited By:

Apr 23, 2020 | 1:44 PM

భారత వాయుసేన సిబ్బంది పలువురు విదేశాల్లో చిక్కుకున్న వారిని మన దేశానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో వారందర్నీ క్వారంటైన్‌లో ఉంచింది. విదేశాలల్లో చిక్కుకుపోయిన 485 మందిని భారత వాయుసేన దళం స్వదేశానికి తరలించింది. వారందరికి కరోనా పరీక్షలు చేయగా రిపోర్టులో నెగిటివ్ అని తేలింది. విదేశాల నుంచి మొత్తం 485 మందిని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన స్పెషల్ ఫ్లైట్స్‌లో తీసుకొచ్చారు. వారందర్నీ హిందన్, జైసల్మేర్‌, జోధ్‌పూర్‌, జమ్ముకశ్మీర్‌, లడఖ్ ప్రాంతాల్లోని ఇండియన్‌ ఎయిర్‌ […]

ఊపిరి పీల్చుకున్న భారత వాయుసేన..!
Follow us on

భారత వాయుసేన సిబ్బంది పలువురు విదేశాల్లో చిక్కుకున్న వారిని మన దేశానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో వారందర్నీ క్వారంటైన్‌లో ఉంచింది. విదేశాలల్లో చిక్కుకుపోయిన 485 మందిని భారత వాయుసేన దళం స్వదేశానికి తరలించింది. వారందరికి కరోనా పరీక్షలు చేయగా రిపోర్టులో నెగిటివ్ అని తేలింది. విదేశాల నుంచి మొత్తం 485 మందిని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన స్పెషల్ ఫ్లైట్స్‌లో తీసుకొచ్చారు. వారందర్నీ హిందన్, జైసల్మేర్‌, జోధ్‌పూర్‌, జమ్ముకశ్మీర్‌, లడఖ్ ప్రాంతాల్లోని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన కేంద్రాల్లో క్వారంటైన్‌లో ఉంచారు.

వారందరికీ 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిన తర్వాత కరోనా టెస్టులు చేపట్టారు. రిపోర్టులో వీరందరికీ నెగిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం వారందర్నీ క్వారంటైన్‌ సెంటర్‌ల నుంచి డిశ్చార్జ్ చేసి ఇళ్లకు పంపిచనున్నారు.