5వేల మార్క్‌ను దాటిన ఒడిషా.. తాజాగా మరో 304 కేసులు..

| Edited By:

Jun 21, 2020 | 1:26 PM

ఒడిషాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అన్‌లాక్ 1.0 తర్వాత విపరీతంగా పెరిగాయి. వందల్లో ఉన్న కేసులు.. ఏకంగా వేలల్లోకి చేరుకున్నాయి.

5వేల మార్క్‌ను దాటిన ఒడిషా.. తాజాగా మరో 304 కేసులు..
Follow us on

ఒడిషాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అన్‌లాక్ 1.0 తర్వాత విపరీతంగా పెరిగాయి. వందల్లో ఉన్న కేసులు.. ఏకంగా వేలల్లోకి చేరుకున్నాయి. తాజాగా ఐదువేల మార్క్‌ను కూడా దాటేసింది. ఆదివారం నాడు కొత్తగా మరో 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,160కి చేరుకుంది. ఈ విషయాన్ని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,607 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే.. మరోవైపు దేశ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 15,413 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,10,461కి చేరుకుంది.