“మహా” పోలీసుల్లో కరోనా టెన్షన్‌..కొత్తగా మరో 303కేసులు

మహారాష్ట్ర పోలీసులను కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే రాష్టరంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. పోలీసుల్లో కూడా కరోనా పాజిటివ్‌..

మహా పోలీసుల్లో కరోనా టెన్షన్‌..కొత్తగా మరో 303కేసులు

Edited By:

Updated on: Aug 16, 2020 | 1:23 PM

మహారాష్ట్ర పోలీసులను కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే రాష్టరంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. పోలీసుల్లో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో.. సిబ్బందిలో కలకలం రేగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా 12 వేల మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతేకాదు వందకు పైగా కరోనా బారినపడి మరణించారు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 303 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌గా తేలిన పోలీసు సిబ్బంది సంఖ్య 12,290కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 9,850 ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,315 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు.

Read More :

ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు