నేపాల్‌ మసీదులో మన ఇండియన్స్.. చెక్ చేస్తే కరోనా పాజిటివ్‌..!వివరాలు ఇవే..

నేపాల్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ కేవలం సింగిల్‌ డిజిట్‌ పాజిటివ్‌ కేసులు ఉండగా.. సడన్‌గా ఇప్పుడు డబుల్ డిజిట్‌కు చేరింది. అది కూడా మన దేశానికి చెందిన ముగ్గురికి పాజిటివ్ తేలడంతో. ఇక వివరాల్లోకి వెళితే.. నేపాల్‌లోని బిర్గంజ్‌ జిల్లాలోని చ్చప్‌కయా ప్రాంతంలోకి ఓ మసీదులో 21 మంది ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వీరందరూ ఇటీవల అక్కడ జరిగిన ఓ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. అయితే వీరందరికీ కరోనా పరీక్షలు చేయగా.. […]

నేపాల్‌ మసీదులో మన ఇండియన్స్.. చెక్ చేస్తే కరోనా పాజిటివ్‌..!వివరాలు ఇవే..

Edited By:

Updated on: Apr 12, 2020 | 4:45 PM

నేపాల్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ కేవలం సింగిల్‌ డిజిట్‌ పాజిటివ్‌ కేసులు ఉండగా.. సడన్‌గా ఇప్పుడు డబుల్ డిజిట్‌కు చేరింది. అది కూడా మన దేశానికి చెందిన ముగ్గురికి పాజిటివ్ తేలడంతో. ఇక వివరాల్లోకి వెళితే.. నేపాల్‌లోని బిర్గంజ్‌ జిల్లాలోని చ్చప్‌కయా ప్రాంతంలోకి ఓ మసీదులో 21 మంది ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వీరందరూ ఇటీవల అక్కడ జరిగిన ఓ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. అయితే వీరందరికీ కరోనా పరీక్షలు చేయగా.. భారత్‌కు చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురి వయస్సు..37 ఒకరిది కాగా.. మరోకరిది 44 ఇంకొకరిది 55 ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీరిని నారాయణి ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

తాజాగా నమోదైన ఈ మూడు పాజిటివ్‌ కేసులతో.. నేపాల్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది. అయితే.. ఏప్రిల్ 14వ వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ముగ్గురు భారతీయులు.. బిర్గంజ్‌ ప్రాంతంలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీరు.. ఎవరెవరితో కలిశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వీరు ఉన్న ప్రాంతంలోని 21 మందిని క్వారంటైన్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.