Covid-19: మహా నగరం పోలీసు శాఖలో కరోనా కలకలం.. ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారంటే..?

|

Apr 14, 2021 | 12:25 PM

Policeman Iinfected Covid-19: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి భారీగా పెరుగుతోంది. నిత్యం వేలల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుల్లో దాదాపు సగం

Covid-19: మహా నగరం పోలీసు శాఖలో కరోనా కలకలం.. ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారంటే..?
Police
Follow us on

Policeman Iinfected Covid-19: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి భారీగా పెరుగుతోంది. నిత్యం వేలల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుల్లో దాదాపు సగం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా సెకెండ్ వేవ్ మరింత తీవ్ర రూపం దాల్చింది. నిత్యం 60 వేల కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. కరోనా కట్టడిలో విధుల్లో పాల్గొంటూ కీలకపాత్ర పోషిస్తున్న పోలీసులు అధికంగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముంబై నగరంలో వారం రోజుల వ్యవధిలో ఏకంగా 279 మంది పోలీసులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. అయితే.. కరోనా కారణంగా ఇప్పటివరకూ 101 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. కాగా మహారాష్ట్రలో ఎక్కువగా ముంబైలో, పూణేలో కేసులు నమోదవుతున్నాయి.

అయితే ఇప్పటివరకూ ముంబై పోలీసు శాఖలో 70 శాతం మంది పోలీసులు కరోనా టీకా తీసుకున్నారు. అయినప్పటికీ వీరిలోని చాలామంది కరోనా బారిన పడుతున్నారు. గత ఆదివారం కరోనా కారణంగా ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ సైతం మరణించారు. ముంబైలో గడిచిన ఏప్రిల్ 11 వరకూ మొత్తం 7,997 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో 7,442 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం 454 మంది పోలీసులు కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మీడియాకు లభించిన గణాంకాల ప్రకారం ముంబైలో ఇప్పటివరకూ మొత్తం 30,756 మంది పోలీసులకు కరోనా మొదటి డోసు టీకా ఇచ్చారు. దాదాపు 5 వేల మంది సెకండ్‌ డోస్‌ ఇచ్చారు. అయినప్పటికీ చాలామంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read:

బిట్ కాయిన్ ఆల్ టైం రికార్డ్, వాల్‌స్ట్రీట్‌లో క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ త‌న షేర్లను ఆవిష్కరిస్తున్న వేళ అద్భుతం