“మహా” పోలీసులను వదలని కరోనా.. మరో 236 మందికి పాజిటివ్

| Edited By:

Jul 29, 2020 | 4:30 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి పోలీసులను వదలడం లేదు. ప్రతి రోజు సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. దీంతో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో పాటు.. వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. తాజాగా..

మహా పోలీసులను వదలని కరోనా.. మరో 236 మందికి పాజిటివ్
Follow us on

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి పోలీసులను వదలడం లేదు. ప్రతి రోజు సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. దీంతో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో పాటు.. వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 236 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,958 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 6,962 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,898 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర స్టేట్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు 98 మంది మరణించారు.

ఇదిలావుంటే.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ముంబై నగరంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. మంగళవారం నాడు 700 లోపు కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబైలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. అటు ధారవిలో కూడా కరోనా దాదాపు నియంత్రణలోకి వస్తోంది.