మరో 23 మంది ఐటీబీపీ సిబ్బందికి కరోనా పాజిటివ్

| Edited By:

Jul 02, 2020 | 1:22 PM

కరోనా మహమ్మారి కేంద్ర రక్షణ బలగాలను వదలడం లేదు. ఓ వైపు బీఎస్ఎఫ్,సీఆర్పీఎఫ్, జవాన్లు పెద్ద సంఖ్యలో కరోన బారినపడుతున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఐటీబీపీ సిబ్బంది..

మరో 23 మంది ఐటీబీపీ సిబ్బందికి కరోనా పాజిటివ్
Follow us on

కరోనా మహమ్మారి కేంద్ర రక్షణ బలగాలను వదలడం లేదు. ఓ వైపు బీఎస్ఎఫ్,సీఆర్పీఎఫ్, జవాన్లు పెద్ద సంఖ్యలో కరోన బారినపడుతున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఐటీబీపీ సిబ్బంది కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా మరో 23 మంది ఐటీబీపీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బుధవారం రాత్రి ఈ విషయాన్ని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారి తెలిపారు. ఐటీబీపీకి చెందిన సిబ్బంది వందల సంఖ్యలో కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం 103 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. వీటిలో 23 మంది ఢిల్లీలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 251 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఆరు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. మరో మూడు లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.