కరోనా గుప్పిట్లో ముంబై.. గడిచిన 24 గంటల్లో పరిస్థితి చూస్తే..

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ముంబైలో కొత్తగా 204 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో.. ఒక్క ముంబై నగరంలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,753కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్యలో ఎక్కువ శాతం ముంబైకి చెందిన వారే కావడం గమనార్హం. గడిచిన 24 […]

కరోనా గుప్పిట్లో ముంబై.. గడిచిన 24 గంటల్లో పరిస్థితి చూస్తే..

Edited By:

Updated on: Apr 14, 2020 | 9:19 PM

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ముంబైలో కొత్తగా 204 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో.. ఒక్క ముంబై నగరంలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,753కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్యలో ఎక్కువ శాతం ముంబైకి చెందిన వారే కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో ముంబై నగరంలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ముంబైలోనే మొత్తం 111 మంది కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటి వరకు 154 మంది కోలుకుని.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని మహా సర్కార్ ప్రకటించింది. ఇక ఆసియాలోని అతిపెద్ద స్లమ్‌గా చెప్పుకునే ముంబై నగరంలోని ధారవిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో ఆరు కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతిచెందారు.ఇప్పటి వరకు ఒక్క ధారవి ప్రాంతంలోనే 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.