లేఖను తప్పుగా అర్థం చేసుకున్నారు, జితిన్ ప్రసాద

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తాము రాసిన లేఖను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ లేఖపై సంతకం చేసిన 23 మందిలో ఒకరైన జితిన్ ప్రసాద అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వాల..

లేఖను తప్పుగా అర్థం చేసుకున్నారు, జితిన్ ప్రసాద
Follow us

| Edited By: Team Veegam

Updated on: Aug 29, 2020 | 5:57 PM

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తాము రాసిన లేఖను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ లేఖపై సంతకం చేసిన 23 మందిలో ఒకరైన జితిన్ ప్రసాద అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వాల పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని, అలాగే వారు కూడా తనపై విశ్వాసం ఉంచారని ఆయన చెప్పారు. పార్టీ నాయకత్వాన్ని తిట్టి పోసేందుకే ఈ లేఖ రాశారన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.  యూపీలోని లఖిమ్ పూరి ఖేరి జిల్లా కాంగ్రెస్ కమిటీ..ఈయనను పార్టీ నుంచి బహిష్కరించాలని, కఠిన క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సోనియాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లెటర్ రాయడంలో తమ తప్పులేదని, కేవలం ఆత్మపరిశీలన చేసుకుని పార్టీని బలోపేతం చేయాలన్నదే తమ ఉద్దేశమని ప్రసాద వ్యాఖ్యానించారు.

పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించాలన్నది తమ ఉద్దేశం కాదని ఆయన చెప్పారు. రాజ్యసభలో  పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ సోనియా అధ్యక్షురాలి హోదాలో కమిటీని నియమించడంతో.. ఈ అసంతృప్తులంతా మెల్లగా మెతకపడుతున్నారు. పార్టీలో పెద్ద సంక్షోభం లేవదీయాలన్న వీరి ప్రయత్నాలు  ఫలించలేదు.

కమలా హారిస్ కన్నా నా కూతురే బెటర్, డొనాల్డ్ ట్రంప్

వచ్ఛే ఏడాది జనవరి తరువాతే కోవిడ్ -19 వ్యాక్సీన్…ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రసాదం తిని పది మందికి తీవ్ర అస్వస్థత.. ఎక్కడంటే?

డిప్రెషన్ వల్లే సుశాంత్ మృతి, ముంబై పోలీసుల వెల్లడి

రాజస్తాన్ సంక్షోభంపై చర్చించా, అధిష్టానంతో నా చర్చలు ఫలప్రదం, సచిన్ పైలట్ 

పాట్నా…. ఓ మురికికూపం.. తిలా పాపం తలా పిడికెడు