ప్రసాదం తిని పది మందికి తీవ్ర అస్వస్థత.. ఎక్కడంటే?

పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ గురుద్వారాలోని ప్రసాదం తిని 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌కు చెందిన రఘువీర్ సింగ్ అనే వ్యక్తి తల్లి ఇటీవలే మరణించారు. దీంతో శనివారం రఘువీర్ సింగ్ తన ఇంటిలో సుఖ్మాణి సాహిబ్ ప్రార్థనా..

ప్రసాదం తిని పది మందికి తీవ్ర అస్వస్థత.. ఎక్కడంటే?
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 12:24 PM

పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ గురుద్వారాలోని ప్రసాదం తిని 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌కు చెందిన రఘువీర్ సింగ్ అనే వ్యక్తి తల్లి ఇటీవలే మరణించారు. దీంతో శనివారం రఘువీర్ సింగ్ తన ఇంటిలో సుఖ్మాణి సాహిబ్ ప్రార్థనా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఇంట్లో అందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. మిగిలిన ప్రసాదాన్ని తార్న్ తరణ్ గురుద్వారాకు తీసుకెళ్లి.. అక్కడున్న భక్తులకు ఈ ప్రసాదాన్ని పంచారు. అయితే ఈ ప్రసాదం తిన్న వెంటనే 10 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని అమృత్‌సర్‌లోని ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కానీ ఇంట్లో ప్రసాదం తిన్న వారందరూ ఎలాంటి అస్వస్థతకు గురి కాలేదు. దీంతో గురుద్వారాకు తీసుకెళ్లిన ప్రసాదంలో విషం కలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Read More: 

కరోనా ఎఫెక్ట్: నెల్లూరులో మూతపడ్డ పోలీస్ స్టేషన్

నాగాలాండ్‌లో కుక్క మాంసం బ్యాన్..