రాజస్తాన్ సంక్షోభంపై చర్చించా, అధిష్టానంతో నా చర్చలు ఫలప్రదం, సచిన్ పైలట్

రాజస్తాన్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో చర్చించానని, తన అభిప్రాయాలను వారు సావధానంగా విన్నారని అసమ్మతి నేత సచిన్ పైలట్ తెలిపారు.

రాజస్తాన్ సంక్షోభంపై చర్చించా, అధిష్టానంతో నా చర్చలు ఫలప్రదం, సచిన్ పైలట్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 11, 2020 | 11:19 AM

రాజస్తాన్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో చర్చించానని, తన అభిప్రాయాలను వారు సావధానంగా విన్నారని అసమ్మతి నేత సచిన్ పైలట్ తెలిపారు. సంక్షోభం త్వరలో పరిష్కారం కాగలదని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. నేను లేవనెత్తిన అంశాల పరిశీలనకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసేందుకు పార్టీ అధిష్ఠానం అంగీకరించింది. ప్రియాంక గాంధీ, అహ్మద్ పటేల్, కేసీ.వేణుగోపాల్ లతో కూడిన ఈ కమిటీ త్వరలో ఓ నివేదిక రూపొందించనుంది అని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి జరగాలని తాను కోరానని, తన వెంట 18 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయాన్ని వివరించానని ఆయన చెప్పారు. కాగా.. సంక్షోభ పరిష్కారానికి.. అసమ్మతి నేతలు రాజీ ధోరణికి రావచ్చునని తెలుస్తోంది. తన అభిప్రాయాలను పార్టీ అగ్ర నాయకత్వం ఓపికగా ఆలకించిందని, అదే నాకు సంతృప్తి కలిగిస్తోందని సచిన్ పైలట్ తెలిపారు.