ఆధార్ విషయంలో ఈ తప్పులు వద్దు..

TV9 Telugu

26 April 2024

నేటి కాలంలో ఎటువంటి బ్యాంక్‌ ఖాతా తెరవాలన్నా, మొబైల్‌ సిమ్‌ తీసుకోవాలన్నా ప్రతి విషయానికి ఆధార్‌ తప్పనిసరి.

కొత్త జాబ్ కోసం కూడా ఆధార్ ఉండాలి. దీంతో జిరాక్స్ సెంటర్లలో కుప్పలుతెప్పలుగా ఆధార్‌కార్డు కాపీలను తీయిస్తున్నాం.

ఇక చేతిలో స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక జిరాక్స్ కాపీలకు బదులు ఆధార్‌కార్డులనే నేరుగా ఫొటోలు తీసి ఎవరెవరికో పంపిస్తున్నాం.

అయితే కేంద్రం ప్రభుత్వం ఆధార్‌కార్డు గురించి కీలక సూచనలు జారీ చేసింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం రండి.

ఆధార్‌కార్డు, వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయొద్దని ప్రజలకు హెచ్చరించింది భారతీయ కేంద్ర ప్రభుత్వం.

అందుకు కారణం లేకపోలేదు. ఇలా చేయడం వల్ల మన విలువైన సమాచారం ఇతరుల చేతిలోకి తేలిగ్గావెళ్లిపోతుందట.

మీ ఆధార్‌ నెంబర్‌ను సోషల్‌మీడియా ఉంచవద్దు. అలాగే మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఆధార్ ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు.

ఇక ఎవరికైనా ఆధార్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తితే వెంటనే 24/7 టోల్‌ఫ్రీ నెంబర్‌ 1947ను సంప్రదించాలి.