చెర్రీ ఫేవరెట్ హీరోయిన్‌ ఎవరో తెలుసా..!

ప్రేక్షకులకే కాదు.. మన హీరో హీరోయిన్లకు కూడా అభిమాన హీరోలు, హీరోయిన్లు ఉంటారు. అలా ఇప్పటి హీరోయిన్లలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కు నచ్చే హీరోయిన్ ఎవరో తెలుసా..?

చెర్రీ ఫేవరెట్ హీరోయిన్‌ ఎవరో తెలుసా..!
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 6:08 PM

ప్రేక్షకులకే కాదు.. మన హీరో హీరోయిన్లకు కూడా అభిమాన హీరోలు, హీరోయిన్లు ఉంటారు. అలా ఇప్పటి హీరోయిన్లలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కు నచ్చే హీరోయిన్ ఎవరో తెలుసా..? ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు చెర్రీ. ఇప్పటి హీరోయిన్లలో తనకు సాయిపల్లవి అంటే ఇష్టమని ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పేశారు చెర్రీ. కాగా ఎన్టీఆర్ సైతం ఇప్పటి హీరోయిన్లలో తనకు సాయి పల్లవి అంటే ఇష్టమని ఓ సందర్భంలో వెల్లడించిన విషయం తెలిసిందే. మరి ఈ ఇద్దరిలో ఈ బ్యూటీకి ఎవరైనా త్వరలో అవకాశం ఇస్తారేమో చూడాలి.

కాగా ఫిదాలో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. ఆ మూవీతో ఇక్కడ చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. అందం, అభినయానికి తోడు ఆమె డ్యాన్స్‌ అప్పట్లో అందరినీ తెగ ఆకట్టుకుంది. దీంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు కూడా వచ్చాయి. కానీ సినిమాల విషయంలో పక్కా ప్లాన్ ఉండటం.. గ్లామర్‌ విషయంలో హద్దులు పెట్టుకోవడంతో చాలా అవకాశాలను వదిలేసుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నాగ చైతన్య సరసన లవ్‌ స్టోరీ, రానాతో విరాట పర్వంలో నటిస్తోంది. వీటితో పాటు కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శర్వాతో రెండోసారి జత కట్టబోతోంది ఈ మలార్ బ్యూటీ.

Read This Story Also: బన్నీ మూవీ టైటిల్.. అదే సెంటిమెంట్ ఫాలో అవుతోన్న సుకుమార్..!

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..