Sunny Deol: ఎందుకు బ్రో అంత కోపం.. ఆవేశం ఆపుకోలేక కారు అద్దం పగలకొట్టిన నటుడు

ఇటీవలే ఈ ఇద్దరూ సూపర్ హిట్స్ అందుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు హీరోలు హిట్స్ అందుకున్నారు. గదర్ 2 సినిమాతో సన్నీ డియోల్, యానిమల్ సినిమాతో బాబీ డియోల్ సక్సెస్ అందుకున్నారు. ఈ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టాయి.

Sunny Deol: ఎందుకు బ్రో అంత కోపం.. ఆవేశం ఆపుకోలేక కారు అద్దం పగలకొట్టిన నటుడు
Sunny Deol
Follow us

|

Updated on: May 06, 2024 | 1:22 PM

బాలీవుడ్ లో డియోల్ ఫ్యామిలీకి మంచి పేరుంది. ఈ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. అలాగే సన్నీ డియోల్, బాబీ డియోల్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇటీవలే ఈ ఇద్దరూ సూపర్ హిట్స్ అందుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు హీరోలు హిట్స్ అందుకున్నారు. గదర్ 2 సినిమాతో సన్నీ డియోల్, యానిమల్ సినిమాతో బాబీ డియోల్ సక్సెస్ అందుకున్నారు. ఈ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టాయి. ఇటీవలే ఈ ఇద్దరు బ్రదస్ ఓ టాక్ షోకు హాజరయ్యారు. బాలీవుడ్ లో’ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ కు సన్నీ, బాబీ హాజరయ్యారు. ఈరియాల్టీ షోలో సన్నీ పవర్ గురించి బాబీ వివరించాడు.

బాబీ డియోల్ సన్నీ డియోల్ యొక్క అత్యంత శక్తివంతమైన వ్యక్తితో పోల్చాల్సి వస్తే ఎవరితో పోలుస్తారు అన్న ప్రశ్నకు … బాబీ సమాధానం ఇస్తూ.. సూపర్‌మ్యాన్ అని అన్నాడు. ‘నా జీవితంలో సూపర్‌మ్యాన్‌లాంటి బలమైన వ్యక్తిని చూశాను, అది సన్నీ అన్నా. తనంత శక్తిమంతుడిని ఎప్పుడూ చూడలేదు. అతనికి చాలా వెన్నుముక శస్త్రచికిత్సలు జరిగాయి. అయితే ఎవరినైనా ఎత్తాల్సి వస్తే తేలిగ్గా ఎత్తేస్తారు. నన్ను కూడా పైకి ఎత్తేస్తాడు అని  బాబీ డియోల్ అన్నారు. అలాగే..

‘కొన్ని రోజుల క్రితం ఇంటి బయట వాకింగ్‌కి వెళ్లాను. సన్నీ అన్న కారు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. కొబ్బరికాయ పడి పగిలిందా అని డ్రైవర్‌ని అడిగాను. కోపంతో సన్నీ గ్లాసును కొడితే అది పగిలిందని డ్రైవర్ చెప్పాడు. ఇది సన్నీ భాయ్ శక్తి’ అని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు. బాబీ డియోల్ ప్రశంసలు విని సన్నీ డియోల్ మురిసిపోయాడు. అలాగే తమ తండ్రి ధర్మేంద్ర ఎప్పుడైనా పిల్లలను కొట్టారా అని బాబీని అడిగాడు కపిల్. ‘వారు మాపై ఎప్పుడూ చేయి చేసుకోలేదు. వాళ్ల కళ్లే మనల్ని భయపెడుతున్నాయి’ అన్నాడు బాబీ. ‘గదర్ 2’తో సన్నీ డియోల్ పెద్ద హిట్ కొట్టాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. బాబీ డియోల్ ‘యానిమల్’ సినిమాతో విజయం సాధించాడు. సన్నీ డియోల్ ప్రస్తుతం ‘లాహోర్ 1947’లో నటిస్తున్నారు. దీనిని అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. బాబీ డియోల్ ‘కంగువా’లో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?