Rajeev
మెగాస్టార్ సినిమా తర్వాత త్రిష తెలుగులో బిజీ అవుతుందా .?
06 May 2024
స్టార్ హీరోయిన్ త్రిష రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా పెరిగిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది త్రిష.
చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా అందరితో సినిమాలు చేసి మెప్పించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్ గా రాణించింది. అయితే ఒకానొక దశలో తెలుగు సినిమాలకు దూరంగా ఉంది .
తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి కవ్వించింది. అలాగే కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది ఈ చిన్నది.
కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆతర్వాత తమిళ్ లో 96 సినిమాతో హిట్ అందుకుంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96 సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాతో త్రిషను మరోసారి తన నటనతో కట్టిపడేసింది. అలాగే పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరో హిట్ అందుకుంది.
ఇక ఇప్పుడు తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తుంది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి