Ghee: మీరు వాడుతోన్న నెయ్యి అసలా.? నకిలీనా.? ఇలా తెలుసుకోండి..

మారుతోన్న కాలంతో పాటు మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈజీ మనీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కొందరు కేటుగాళ్లు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాలను బలిచేస్తూ మరి అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తినే ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. ఐస్‌ క్రీమ్‌లు మొదలు పాల వరకు. కారం నుంచి ఉప్పు వరకు అన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు....

Ghee: మీరు వాడుతోన్న నెయ్యి అసలా.? నకిలీనా.? ఇలా తెలుసుకోండి..
Ghee Purity
Follow us

|

Updated on: May 06, 2024 | 4:03 PM

మారుతోన్న కాలంతో పాటు మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈజీ మనీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కొందరు కేటుగాళ్లు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాలను బలిచేస్తూ మరి అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తినే ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. ఐస్‌ క్రీమ్‌లు మొదలు పాల వరకు. కారం నుంచి ఉప్పు వరకు అన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు. ప్రతీ రోజూ ఇలాంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే మనం ఉపయోగిస్తున్న వస్తువు అసలా, నకిలీనా తెలుసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని మీకు తెలుసా.? కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వస్తువు నాణ్యత గుర్తింవచ్చు. మరి మనం ఇంట్లో ఉపయోగిస్తున్న నెయ్యి నాణ్యమైందేనే కాదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

* మీరు కొనుగోలు చేసిన నెయ్యి స్వచ్ఛమైనదా కాదా అని తెలుసుకోవడానికి ఒక పాత్రలో నీటిని మరిగించాలి. అనంతరం అందులో రెండు చెంచాల నెయ్యిని వేయాలి. ఆ తర్వాత గ్యాస్‌ ఆఫ్‌ చేసిన ఆ పాత్రపై మూత పెట్టాలి 24 గంటలు అలా పక్కన పెట్టేయ్యాలి. ఒకరోజు తర్వాత కూడా నెయ్యి లేత పసుపు రంగులో ఉండి, గడ్డట్టకుండా ఉంటే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం చేసుకోవాలి.

* ఒక పాత్రలో రెండు చెంచాల నెయ్యి వేసి వేడి చేయాలి. వేడిచేసిన తర్వాత నెయ్యి లేత గోధుమరంగులోకి మారుతుంది. వేడిచేసిన తర్వాత నెయ్యి రంగు ఇలా మారితే, నెయ్యి స్వచ్ఛమైనదని అర్థం.

* ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా నెయ్యి కలపండి. కాసేపటి తర్వాత నెయ్యి నీటిపై తేలితే అది స్వచ్ఛమైన నెయ్యి అవుతుంది. కానీ నెయ్యి కల్తీ అయితే గ్లాస్‌ చివరికి వెళ్లి పోతుంది.

* ఒక గిన్నెలో ఒక చెంచా నెయ్యి తీసుకుని అందులో అర చెంచా ఉప్పు, కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. అరగంట అలాగే వదిలేయండి. నెయ్యి స్వచ్ఛంగా ఉంటే అరగంట తర్వాత రంగు మారదు. నెయ్యి కల్తీ అయితే అరగంట తర్వాత రంగు మారుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..
కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..
యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..
యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!