19 May 2024

బెండతో ఆరోగ్యానికి అండ.. 

Narender.Vaitla

ఇక బరువు తగ్గాలనుకునే వారికి కూడా బెండ బెటర్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్‌ కంటెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా బెండకాయ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఇక బెండకాయలో క్యాన్సర్ తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో యాంటీఆక్సిడెంట్స్‌ వి క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టడంలో కూడా బెండకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

చర్మ సంరక్షణలో కూడా బెండకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాం ఆరోగ్యాన్ని కాపాడి, చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి.

గర్భిణీలకు కూడా బెండకాయ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భిణీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

డయాబెటిస్‌తో బాధపడేవారికి బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని గ్లైసెమిక్‌ రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.