Gold: భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. దీని వెనకాల అసలు ఉద్దేశం అదేనా..

ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ పతనమైంది, సామాన్యులకు స్టాక్‌ మార్కెట్‌పై నమ్మకం పోయింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ కాలంలో సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించడానికి ఈ రెండు అతిపెద్ద కారణాలుగా అభిప్రాయపడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చైనాలో బంగారాన్ని దూకుడుగా కొనడం వల్ల రాబోయే రోజుల్లో బంగారం ధరలను నియంత్రించే...

Gold: భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. దీని వెనకాల అసలు ఉద్దేశం అదేనా..
Gold Price
Follow us

|

Updated on: May 06, 2024 | 3:40 PM

మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు $100 తగ్గింది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తోంది. ఈ కొనుగోలు కేంద్ర బ్యాంకుల ద్వారా మాత్రమే కాకుండా, చైనాలోని సాధారణ ప్రజలు సైతం బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం చైనా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ పతనమైంది, సామాన్యులకు స్టాక్‌ మార్కెట్‌పై నమ్మకం పోయింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ కాలంలో సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించడానికి ఈ రెండు అతిపెద్ద కారణాలుగా అభిప్రాయపడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చైనాలో బంగారాన్ని దూకుడుగా కొనడం వల్ల రాబోయే రోజుల్లో బంగారం ధరలను నియంత్రించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి చైనా చైనా ఏ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. దీనివల్ల బంగారం ధరలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, ఆర్థిక సంక్షోభ సమయాల్లో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుంటారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం సమయంలో బంగారం ధరలు ఎలా పెరిగాయో మనం చూశాము. ఆ సమయంలో కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దాదాపు 2300 డాలర్లుగా ఉంది. చైనా దూకుడుగా బంగారం కొనుగోళ్లు ప్రారంభించిన సమయంలో బంగారం ధర ఔన్సుకు 2,400 డాలర్లకు పెరిగింది. రియల్ ఎస్టేట్‌, స్టాక్‌ మార్కెట్‌పై ప్రజల్లో నమ్మకం తగ్గడంతో చైనా ప్రజలు బంగారంపై పెట్టుబడులను పెట్టడం ప్రారంభించారు.

బంగారం మార్కెట్‌లో చైనా ఇప్పటికే గణనీయమైన ఆధిపత్యాన్ని కలిగి ఉంది. కానీ ఈ కొత్త బూమ్ సమయంలో, చైనా ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. 2022 చివరి నుంచి బంగారం ధర 50 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో బంగారంతో పాటు యూఎస్‌ డాలర్ ఇండెక్స్‌ కూడా పెరిగింది. గత నెలలో, ఫెడరల్ రిజర్వ్ చాలా కాలం పాటు వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచుతుందని స్పష్టంగా సూచించింది. ఆ తర్వాత కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కాలంలో, డాలర్ ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీలతో పెరుగుతూనే ఉంది.

కాగా ప్రస్తుతం బంగారం ధరలు మరోసారి 2300 డాలర్లకు చేరువయ్యాయి. బంగారం మార్కెట్ ఇకపై ఆర్థిక కారకాలపై కాకుండా చైనా కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారుల ఇష్టానుసారం పనిచేస్తుందనే అభిప్రాయం అంతర్జాతీయ మార్కెట్‌లో ఊపందుకుంది. లండన్‌కు చెందిన ప్లాట్‌ఫారమ్ MetalsDaily.com సంస్థ సీఈఓ రాస్ నార్మన్, చైనా నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగానే బంగారం ధర పెరిగినట్లు ఒక మీడియా నివేదికలో తెలిపారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. చైనా గోల్డ్ అసోసియేషన్ ప్రకారం, ఆ దేశంలో బంగారం వినియోగం ఏడాది క్రితంతో పోలిస్తే మొదటి త్రైమాసికంలో 6 శాతం పెరిగింది.

ఇక మార్చి నెలలో చైనా 5 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ కమోడిటీ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా తెలిపారు. కాగా, ఏడాది తొలి మూడు నెలల్లో ఈ కొనుగోలు 27 టన్నులుగా నమోదైంది. ప్రస్తుతం చైనా వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వ 2262 టన్నులు. బంగారాన్ని చైనా ఎంత దూకుడుగా కొనుగోలు చేస్తుందో దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు. చైనా ఇన్వెస్టర్లు కూడా గోల్డ్ ఈటీఎఫ్‌లలో తమ పెట్టుబడులను పెంచారని తెలిపారు. చైనీస్ ప్రజలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మరియు స్టాక్ మార్కెట్ కాకుండా వేరే ఎంపికల కోసం చూస్తున్నారని అనూజ్ గుప్తా అన్నారు. దీంతో రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..
ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని
ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని
'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..
రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!