Anil Kumar
మరోసారి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ డేట్ ఫిక్స్. ఎప్పుడంటే.?
06 May 2024
తెలుగమ్మాయి అంజలి నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ తాజాగా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది.
2014లో అంజలి హీరోయిన్ గా రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్ గా రిలీజ్ అయ్యింది.
ఈ 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సీక్వెల్ కూడా సినీ ప్రేక్షకుములను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే..!
అయితే సినిమా మంచి విజయం సాధించినప్పటికీ కలెక్షన్స్ పరంగా కొద్దిగా తగ్గాయి అనే చెప్తున్నాయి సినీ వర్గాలు.
పైగా అంజలికి ఇది 50వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అయితే ఎప్పుడూ , ఎక్కడ అనే వివరాలు ఇక్కడ చూడొచ్చు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా మే 8 న స్ట్రీమింగ్ కానుంది.
గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీలో అంజలితో పాటు శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, సత్య, సునీల్, ప్రధాన పాత్రలు పోషించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి