Anil Kumar
నా తల్లిదండ్రులు నన్ను అలానే పెంచారు.. అదితిరావు హైదరి కామెంట్స్
06 May 2024
టాలీవుడ్ లో అప్పుడప్పుడు వినిపించే పేరు అదితిరావు హైదరి.. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా మలయాళంలో చేసింది.
ఆ తరువాత చాల సినిమాలు చేసింది.. ఇక మెల్లిగా సమ్మోహనం అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ అమ్మడు.
ఈమె టాలీవుడ్ హీరోయిన్ గా నటించిన కొన్ని సినిమాలతోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసింది అదితి.
ఇక తాజాగా బాలీవుడ్ లో హీరామండి సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది ఈ వయ్యారి. ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన అదితి.. హీరామండిలో తాను బిబ్బోజాన్ అనే కేరక్టర్ చేస్తున్నట్టు తెలిపింది.
తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతదూరమైనా వెళ్తుంది బిబ్బోజాన్.. ఆమె అంత స్వేచ్ఛను కోరుకుంటుంది అన్నారు ఈమె.
వ్యక్తిగత జీవితంలో తాను కూడా స్వేచ్ఛను కోరుకుంటానని.. తన తల్లిదండ్రులు అలాగే పెంచారని అన్నారు అతిదిరావు.
అతిదిరావు హైదరి మాట్లాడిన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి