Layoffs: కొనసాగుతోన్న ఉద్యోగుల తొలగింపు.. 20 శాతం మందిని ఇంటికి పంపిస్తోన్న మరో టెక్‌ దిగ్గజం.

|

Feb 10, 2023 | 2:38 PM

ఆర్థిక మాంద్యం ప్రకంపనలు ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉన్నాయి. అమెరికా నుంచి హైదరాబాద్‌ వరకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గూగుల్, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి అంతర్జాతీయ కంపెనీల నుంచి ఎడ్‌టెక్‌ వంటి స్టార్టప్‌లకు వరకు ఉద్యోగులను..

Layoffs: కొనసాగుతోన్న ఉద్యోగుల తొలగింపు.. 20 శాతం మందిని ఇంటికి పంపిస్తోన్న మరో టెక్‌ దిగ్గజం.
Layoffs
Follow us on

ఆర్థిక మాంద్యం ప్రకంపనలు ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉన్నాయి. అమెరికా నుంచి హైదరాబాద్‌ వరకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గూగుల్, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి అంతర్జాతీయ కంపెనీల నుంచి ఎడ్‌టెక్‌ వంటి స్టార్టప్‌లకు వరకు ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా ఇంటికి పంపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో టెక్‌ దిగ్గజం యాహూ వచ్చి చేరింది. ఈ కంపెనీ ఏకంగా 20 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గురువారం ప్రకటించింది.

యాడ్-టెక్‌ విభాగంలోని ఉద్యోగుల్లో సగం మందిని సంస్థ తొలగించనుంది. ప్రస్తుతం 12 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలికిన యాహూ వచ్చే ఆరు నెలల్లో మరో 8 శాతం మందిని ఇంటికి పంపించనున్నట్లు తెలిపింది. మరో ఆరు నెలల పాటు ఆర్థిక మాంద్యం పరిస్థితి తప్పదనే వాదనలకు యాహూ లేఆఫ్‌లు బలం చేకూరుస్తున్నాయి. గురువారం ఆఫీసు కార్యకలాపాలు ముగిసే సమయానికే కంపెనీలో 1000 మందిని తొలగిస్తున్నట్లు యాహూ తమ ఉద్యోగులకు తెలిపింది.

అయితే ఉద్యోగుల తొలగింపునకు ఆర్థిక పరిస్థితులు కారణం కారదని యాహూ సీఈఓ జిమ్‌ లైన్‌జోన్‌ చెప్పడం గమనార్హం. లాభదాయకతలేని కంపెనీ బిజినెస్‌ అడ్వర్టైజింగ్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. డీఎస్‌పీలో పెట్టుబడులను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు యాహూ తెలిపింది. భవిష్యత్తులో ఈ విభాగంలో పెట్టుబడులను మరింత తగ్గించే ప్లాన్‌లో యాహూ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..