
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. లేదంటే మిగతా వారికంటే ఎన్నో యేళ్లు వెనకబడి పోయినంతపని అవుతుంది. ముఖ్యంగా సాంకేతికత విషయంలో ఒకడుగు ఎప్పుడూ ముందుండాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (AIML) వంటి ఇంజనీరింగ్ బ్రాంచులు ప్రస్తుత జాబ్ మార్కెట్లో అత్యధిక జీతాలను అందించే కోర్సుల్లో ముందు వరుసలో ఉన్నాయి. పెరుగుతున్న టెక్ పరిశ్రమ, సైబర్ సెక్యూరిటీ డిమాండ్లు, క్లౌడ్ కంప్యూటింగ్, CSE బ్రాంచ అంతర్జాతీయంగా మరియు జాతీయంగా అత్యధిక జీతాలను అందించడం వల్ల ఇది జరుగుతుంది. కొన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు కొన్ని ప్రత్యేక ఇంజనీరింగ్ బ్రాంచుల్లో డిగ్రీ ఉన్నవారికి మంచి జీతం చెల్లిస్తున్నాయి. ఈ జాబితాలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSE), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (AIML) కాకుండా మరికొన్ని బ్రాంచ్‌లు కూడా అధిక జీతం అందిస్తున్నాయి. అవేంటంటే..
డేటా సైన్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాలు స్పెషలైజేషన్ డిగ్రీ కలిగిన వారికి పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
IIT ల వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి పట్టభద్రులైనవారికి ప్రారంభం నుంచి మెరుగైనా జీతాలు పొందుకుంటారు.
సీనియర్, మేనేజర్ పదవులకు అత్యధిక జీతం లభిస్తుంది. అనుభవం గడించే కొద్ది జీతాలు గణనీయంగా పెరుగుతాయి.
డిమాండ్, జీవన వ్యయాన్ని ప్రతిబింబించేలా ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ వ్యాలీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ హాట్‌స్పాట్‌లు సాధారణంగా అధిక ప్యాకేజీలను అందిస్తాయి. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీల వల్ల మీ సంపాదన సామర్థ్యం మరింత పెరుగుతుంది.
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE), దాని ఉప రంగాలు అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), డేటా సైన్స్ వంటి ఇతర ఇంజనీరింగ్ రంగాలు సాధారణంగా అత్యధిక శాలరీ ఆఫర్ చేస్తాయి. ఇంజనీరింగ్ బ్రాంచులు, అందించే జీతాల మధ్య చాలా ముఖ్యమైన తేడాలు ఉంటాయి. ఇంజనీరింగ్ జీతాల్లో పెరుగుదల ప్రపంచ సాంకేతిక లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AI/ML, డేటా సైన్స్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ వంటి ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు అధిక డిమాండ్ ఉంది. ఈ బ్రాంచుల్లో జీతాలు ఎలా ఉంటాయంటే..
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.