Education Info: టెన్త్ తర్వాత ఏయే కోర్సులు ఉంటాయి? ఇంటర్ పూర్తైన స్టూటెంట్స్ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి? డిప్లామాతో ఉండే ఫ్యూచర్ ఏంటి? ప్రొఫిషనల్ కోర్టులో భవితవ్యం ఎలా ఉంటుంది? ఇలా ఆల్ డౌట్స్ క్లారిఫై ఎట్ వన్ ప్లాట్ ఫాం. అదే టీవీ9, క్యాబ్ సంయుక్త సమ్మిట్. ఇవాళ్టి నుంచి విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సమ్మిట్‌ను మంత్రి పేర్ని నాని ప్రారంభించారు.
ఎస్.ఎస్.కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న సమ్మిట్‌లో 40 పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు సమ్మిట్ ఉపయోగపడనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సమ్మిట్ జరుగుతుంది.
ఎలాంటి కోర్సు ఎంచుకోవాలని ఆలోచిస్తూ.. క్రాస్ రోడ్స్‌లో ఉన్న వారికి గైడెన్స్ ఇచ్చేందుకు ఇదొక మంచి ప్లాట్‌ఫాం అని అన్నారు మంత్రి పేర్ని నాని. ఇలా కొన్నేళ్లుగా విద్యార్థులు, పేరెంట్స్‌కు అవగాహన కల్గిస్తున్న టీవీ9, క్యాబ్‌ను మంత్రి అభినందించారు.
Read also: సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి