Indian Railway: రైల్వేలో 3591ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ.. మే 25 నుంచి దరఖాస్తులు ప్రారంభం

|

May 21, 2021 | 8:41 PM

Indian Railway: నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇక రైల్వేలో కూడా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ పలు నోటిఫికేషన్లను జారీ చేస్తోంది...

Indian Railway: రైల్వేలో 3591ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ.. మే 25 నుంచి దరఖాస్తులు ప్రారంభం
Follow us on

Indian Railway: నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇక రైల్వేలో కూడా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ పలు నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3591 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 మే 25న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 24 చివరి తేదీ.

అయితే మొత్తం 3591 పోస్టులు ఉండగా ముంబై డివిజన్‌- 738, వడోదరా డివిజన్- 489, అహ్మదాబాద్ డివిజన్- 611, రాత్లాం డివిజన్- 434, రాజ్‌కోట్ డివిజన్- 176, భావ్‌నగర్ వర్క్‌షాప్- 210, లోయర్ పరేల్ వర్క్‌షాప్- 396, మహాలక్ష్మి వర్క్‌షాప్- 64, భావ్‌నగర్ వర్క్‌షాప్- 73, దహోద్ వర్క్‌షాప్- 187, ప్రతాప్‌నగర్ వర్క్‌షాప్ వడోదర- 45, సబర్మతీ ఇంజనీరింగ్ వర్క్‌షాప్ అహ్మదాబాద్- 60, సబర్మతీ సిగ్నల్ వర్క్‌షాప్ అహ్మదాబాద్- 25, హెడ్‌క్వార్టర్ ఆఫీస్-34 పోస్టులున్నాయి. అయితే ఈ పోస్టులకు పదో తరగతి అర్హతతో 50 శాతం మార్కులు ఉండాల్సి ఉంటుంది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. ఆసక్తి గల అభ్యర్థులు పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ https://www.rrc-wr.com/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు లింక్ 2021 మే 25న ఉదయం 11 గంటలకు యాక్టివేట్ అవుతుంది.

ఇవీ చదవండి:

NIPER Kolkata Recruitment 2021: నైప‌ర్ కోల్‌క‌తాలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

TS 10th Results 2021: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల.. ఇలా చెక్ చేసుకోండి..