
తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో.. రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో విధానంలో డిసెంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఏఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, ఎంఎస్‌డబ్ల్యూలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా తమ దరఖాస్తులు లేదా బయోడేటాను, అనుభవ పత్రాలు, అవసరమైన ధృవపత్రాలతో జతచేసి ఆఫ్‌లైన్ విధానంలో ఈ కింది అడ్రస్‌లో డిసెంబర్ 5, 2025వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.4,000 నుంచి రూ.33,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింద చెల్లించవల్సి ఉంటుంది.
శిశుసంక్షేమ శాఖ, పెద్దపల్లి జిల్లా కార్యాలయం
అప్లికేషన్ ఫారంను డౌన్‌లోడ్ చేసుకునే లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.