IRMS 2023: వచ్చే ఏడాది నుంచి యూపీఎస్సీ ద్వారా ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ పరీక్ష

|

Dec 03, 2022 | 7:01 PM

ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఎంఎస్‌) పరీక్షను 2023 నుంచి యూపీఎస్సీ ద్వారా నిర్వహించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం (డిసెంబరు 2) వెల్లడించింది. ఐఆర్‌ఎంఎస్‌ పోస్టులను..

IRMS 2023: వచ్చే ఏడాది నుంచి యూపీఎస్సీ ద్వారా ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ పరీక్ష
UPSC to hold separate exam for IRMS
Follow us on

ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఎంఎస్‌) పరీక్షను 2023 నుంచి యూపీఎస్సీ ద్వారా నిర్వహించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం (డిసెంబరు 2) వెల్లడించింది. ఐఆర్‌ఎంఎస్‌ పోస్టులను ప్రత్యేకంగా రూపొందించిన పరీక్ష విధానం ద్వారా నియామకాలు చేపట్టనున్నారు.

ఐఆర్‌ఎంఎస్‌ నియామక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే..

ఐఆర్‌ఎమ్‌ఎస్‌ నియామక ప్రక్రియ రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్‌), రెండో దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సివిల్‌ 30, మెకానికల్‌ 30, ఎలక్ట్రికల్‌ 60, కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ 30 విభాగాలకు చెందిన మొత్తం 150 పోస్టులకు ఐఆర్‌ఎంఎస్‌ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మెయిన్స్‌కు అనుమతిస్తారు. మెయిన్స్‌ పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు (ఎస్సే విధానం) ఉంటాయి.

  • క్వాలిఫైయింగ్‌ పేపర్స్‌ కింద పేపర్‌-ఎ భారతీయ భాషల్లో ఏదైనా ఒకదానికి 300 మార్కులకు ఉంటుంది.
  • పేపర్‌-బి ఇంగ్లిష్‌లో 300 మార్కులకు ఉంటుంది.
  • మెరిట్‌ కోసం పరిగణనలోకి తీసుకొనే అప్షనల్‌ సబ్జెక్ట్‌ పేపర్‌-1కు 250 మార్కులు ఉంటాయి.
  • పేపర్‌-2 250 మార్కులకు ఉంటుంది.
  • ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.

సివిల్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, కామర్స్‌ అండ్‌ అకౌంటెన్స్‌లో ఏదో ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకోవచ్చు. పై అన్ని పేపర్ల సిలబస్‌, ఆప్షనల్‌ సబ్జెక్టుల ఎంపిక సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల తరహాలోనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.