UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

|

Sep 04, 2021 | 7:36 AM

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా..

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Upsc
Follow us on

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 23 ఖాళీలకు గాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌–02, అగ్రికల్చర్‌ ఇంజనీర్‌–01, అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌–20 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంఎస్సీ డిగ్రీ(బోటనీ/ప్లాంట్‌ పాథాలజీ)లో ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా కనీసం ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు.
* అగ్రికల్చర్‌ ఇంజనీర్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు డిగ్రీ(ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 33ఏళ్లు మించకూడదు.
* అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ పోస్టులకు మాస్టర్స్‌ డిగ్రీని అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 30ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి.. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా 19-09-2021గా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Hiring Trends: ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు.. లింక్డ్‌ఇన్‌ ఇండియా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి.

Ministry of Defence Recruitment 2021: పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.19,900 ఇతర అలవెన్స్‌లు కూడా..

SBI Clerk: మీరు ఎస్‌బీఐ క్లర్క్‌ పరీక్షకు హాజరయ్యారా.. ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుందో తెలుసా.?