UPSC ESE Prelims 2022: యూపీఎస్సీ ఈఎస్ఈ-2022 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష రోజున ఇవి తప్పనిసరిగా తీసుకెళ్లాలి

|

Feb 01, 2022 | 7:59 AM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 (UPSC ESE 2022) ప్రిలిమినరీ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌ (Admit Card)ను విడుదల చేసింది. ఫిబ్రవరి 20న..

UPSC ESE Prelims 2022: యూపీఎస్సీ ఈఎస్ఈ-2022 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష రోజున ఇవి తప్పనిసరిగా తీసుకెళ్లాలి
Upsc Ese Prelims 2022
Follow us on

UPSC ESE Prelims Admit Card 2022 Released: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 (UPSC ESE 2022) ప్రిలిమినరీ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌ (Admit Card)ను విడుదల చేసింది. ఫిబ్రవరి 20, 2022న రెండు షిఫ్టుల్లో జరగనున్న ఈఎస్‌ఈ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఈ కింది విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

UPSC ESE -2022 అడ్మిట్ కార్డ్‌ను ఈ విధంగా డౌన్‌లోడ్ చేయాలి..

  •  మొదట యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inను ఓపెన్ చెయ్యాలి.
  • హోమ్‌పేజీలో ‘లేటెస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆపై ‘ఇ-అడ్మిట్ కార్డ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్’ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • రిజిస్టర్ అయిన రిజిస్ట్రేషన్ ఐడి లేదా రోల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
  • UPSC ESE ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది.
  • అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేసుకోవాలి.

అభ్యర్థులు తమకు కేటాయించిన అడ్మిట్ కార్డులను పరీక్షా కేంద్రాలకు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. లేదంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరు. ఈ-అడ్మిట్ కార్డులపై అభ్యర్ధులకు చెందిన ఫొటోగ్రాఫ్ స్పష్టంగాలేకపోతే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్ వంటి ఇతర ఐడెంటిటీ ఫ్రూఫ్‌లను పరీక్ష హాలుకు తీసుకెళ్లాలి. అలాగే ప్రతి సెషన్‌కు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లను కూడా తప్పనిసరిగా తీసుకురావాలి.

కోవిడ్ ప్రొటోకల్‌ను తప్పనిసరిగా ఫాలోకావాలి. దీనిలో భాగంగా అభ్యర్థులందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి. మాస్క్ లేని వారిని పరీక్ష హాలులోకి అనుమతించబడరు. ఐతే అధికారులు వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు కోరినప్పుడు తమ మాస్క్‌లను తీయవలసి ఉంటుంది. అభ్యర్థులు తమతోపాటు పరీక్ష హాలులోకి చిన్న బాటిల్‌లో హ్యాండ్ శానిటైజర్‌ను తీసుకెళ్లవచ్చు. ఇక యూపీఎస్సీ నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 500 మార్కులకు ఉంటుంది. MCQ ఫార్మాట్‌లో ప్రశ్నలు ఉంటాయి.

Also Read:

THSTI Jobs: ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ అర్హతతో.. టీహెచ్‌ఎస్‌టీఐలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!