UPSC ESE 2021 final results: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021 తుది ఫలితాలు విడుదల..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) 2021 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది (2022) ఫిబ్రవరి, మార్చిలో..

UPSC ESE 2021 final results: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021 తుది ఫలితాలు విడుదల..
Upsc Ese 2021 Results
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 29, 2022 | 8:50 AM

UPSC ESE 2021 Result Download: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) 2021 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది (2022) ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు సంబంధించిన ఫలితాల ఆధారంగా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021 ఫైనల్‌ రిజల్ట్స్‌ ప్రకటించారు. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా మొత్తం 194 మంది అభ్యర్ధులు ఇంజనీరింగ్‌ సర్వీస్‌కు ఎంపికయ్యినట్లు వారి పేరు, రోల్ నెంబర్లను కమీషన్‌ విడుదల చేసింది. ఓరిజినల్ డిక్యుమెంట్లు ప్రామాణికత నిర్ధారణ వరకు 29 మంది అభ్యర్ధుల ఫలితాలు తాత్కాలిక జాబితా (tentative list)లో ఉంచినట్లు, అప్పటివరకు ఎటువంటి నియామక ప్రతిపాదనలు జారీ చేయబడవని తెలిపింది. 3 నెలల సమయం గడువుగా నిర్ణయించి, ఈ గడువులోగా అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించని పక్షంలో వారి అభ్యర్ధిత్వం రద్దు అవుతుందని, ఈ విషయంలో ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించబడవని కమిషన్‌ స్పష్టం చేసింది. కాగా మొత్తం 225 పోస్టులకుగానూ ఈ నియామక ప్రక్రియ కొనసాగింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెలికాం రంగాల్లో ఖాళీల భర్తీకి UPSC ESE 2021 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలను ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్upsc.gov.inను ఓపెన్ చెయ్యాలి.
  • తర్వాత ఫైనల్ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • తదుపరి ‘ఎగ్జామినేషన్ ఫైనల్ రిజల్ట్స్’పై క్లిక్ చెయ్యాలి.
  • ఇంజినీరింగ్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష 2021కు ముందు కనిపించే పీడీఎఫ్‌ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింట్‌ఔట్ తీసుకోవాలి.

Also Read:

APVVP Visakhapatnam Jobs: నెలకు రూ. 52 వేల జీతంతో.. విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. అర్హతలివే!