NCR Sports Quota Recruitment 2022: స్పోర్ట్స్ కోటాలో.. నార్త్ ఈస్టర్న్ రైల్వేలో గ్రూప్ సీ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గోరఖ్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ ఈస్టర్న్ రైల్వే (NCR).. స్పోర్ట్స్ కోటా ద్వారా గ్రూప్ సీ పోస్టుల (Group C posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..
North Central Railway Sports Quota Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గోరఖ్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ ఈస్టర్న్ రైల్వే (NCR).. స్పోర్ట్స్ కోటా ద్వారా గ్రూప్ సీ పోస్టుల (Group C posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: స్పోర్ట్స్ కోటా ద్వారా గ్రూప్ సీ పోస్టులు
క్రీడల లిస్టు: క్రికెట్, కబడ్డీ, బాస్కెట్ బాల్, హాకీ, వాలీవాల్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడలు.
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఒలంపిక్ గేమ్స్, వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్‌షిప్, కామన్‌వెల్త్ గేమ్స్, ఛాంపియన్స్ ట్రోపీలో పాల్గొని ఉండాలి.
ఎంపిక విధానం: ఫీల్డ్ ట్రయల్స్, సాధించిన పతకాలు, విద్యార్హతల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్ధులకు: రూ. 500 ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ. 250
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: