UPSC Civil Services 2025 Exam Today: నేడే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష.. అరగంట ముందే కేంద్రాల్లోకి అనుమతి!

వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2025 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం (మే 25) జరగనుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఈ రోజు ఆఫ్‌లైన్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష..

UPSC Civil Services 2025 Exam Today: నేడే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష.. అరగంట ముందే కేంద్రాల్లోకి అనుమతి!
UPSC Civil Services 2025 Exam

Updated on: May 25, 2025 | 7:15 AM

హైదరాబాద్‌, మే 25: దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2025 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం (మే 25) జరగనుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఈ రోజు ఆఫ్‌లైన్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష నిర్వహిస్తారు.

అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం పరీక్షకు 8 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అంటే ఉదయం 9 గంటల తర్వాత, మధ్యాహ్నం 2 తర్వాత అభ్యర్థులను ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్‌ కార్డు, పెన్ను, పెన్సిల్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్‌ గుర్తింపు కార్డును తమ వెంట తప్పనిసరిగా తీసుకెళ్లవల్సి ఉంటుంది. ఎగ్జామ్‌ సెంటర్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి ఉండదు. చేతి గడియారాలు, సెల్‌ఫోన్లు బయటే వదలివెళ్లాలి. పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటనలో సూచించారు.

పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ అమలు

అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ అమలు చేయనున్నారు. అలాగే పటిష్ట పోలీసుల బందోబస్తు కూడా ఉంటుంది. అన్ని యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమనరీ పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు చేయనున్నారు. అలాగే పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలు, ఊరేగింపులకు అనుమతి ఉండదు. పరీక్ష కేంద్రాలకు చుట్టుపక్కల ఉన్న అన్ని ఇంటర్నెట్‌, జిరాక్స్‌ సెంటర్లు మూసివేతలో ఉంటాయి. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.