UPSC Civil Servises Prelims 2025: మరోవారంలో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ ప్రిలిమ్స్‌ పరీక్ష.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు

అఖిల భారత సర్వీసుల నియామకాలకు నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష 2025 మే 25న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జరగనుంది. ఈ క్రమంలో తాజాగా పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది..

UPSC Civil Servises Prelims 2025: మరోవారంలో యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ ప్రిలిమ్స్‌ పరీక్ష.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు
UPSC Civil Servises Prelims

Updated on: May 16, 2025 | 8:32 AM

హైదరాబాద్, మే 16: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. అఖిల భారత సర్వీసుల నియామకాలకు నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష 2025 మే 25న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఈ ఏడాది మొత్తం 979 సివిల్ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. జనవరి 22 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇక ప్రిలిమినరీ పరీక్షకు సమయం దగ్గర పడుతుండటంతో తాజాగా అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

యూపీఎస్సీ.. ఈ అడ్మిట్‌ కార్డులను మే 25 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ప్రిలిమ్స్‌ పరీక్ష మే 25న జరిగిన తర్వాత ఈ అడ్మిట్‌ కార్డును పారవేసుకోకుండా.. తుది ఫలితాలు వెలువడే వరకు జాగ్రత్తగా దాచుకోవాలని యూపీఎస్సీ సూచించింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా అడ్మిట్‌కార్డును సులువుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్‌ పరీక్ష అనంతరం మెయిన్స్‌, ఇంటర్వ్యూ ఆధారంగా సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాల తుది ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లకు ఉంటుంది. రెండు పేపర్లలోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటాయి. రెండో పేపర్‌లో కనీస అర్హత మార్కులు తెచ్చుకుంటేనే మొదటి పేపర్‌ మూల్యాంకనం చేస్తారు.

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష 2025 ఈ-అడ్మిట్‌ కార్డు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఏపీ ఈసెట్‌ 2025 ఫలితాల్లో 93 శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ 2025 ఫలితాలను అనంతపురం జేఎన్‌టీయూ గురువారం (మే 15) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 34,224 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 31,922 మంది అంటే 93.26 శాతం మంది అర్హత సాధించినట్టు ఏపీ ఈసెట్‌ కన్వీనర్‌ బి దుర్గాప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ ఈసెట్‌ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.