UPSC Civils Notification 2026: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 నోటిఫికేషన్ వచ్చేస్తుంది.. ఇంతకీ ఎప్పుడంటే?

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ వారంలోనే నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిజానికి జనవరి 14వ తేదీనే సివిల్‌ సర్వీసెస్ నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా..

UPSC Civils Notification 2026: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 నోటిఫికేషన్ వచ్చేస్తుంది.. ఇంతకీ ఎప్పుడంటే?
UPSC Civil Services 2026 Notification Date

Updated on: Jan 29, 2026 | 8:37 AM

హైదరాబాద్‌, జనవరి 29: దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ వారంలోనే నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిజానికి జనవరి 14వ తేదీనే సివిల్‌ సర్వీసెస్ నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఓ ప్రకటనలో తెలిపింది. అందిన సమాచారం మేరకు ఈ వారం చివరిలోపు సివిల్స్‌ అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక నోటిఫికేషన్‌ విడుదలైన తేదీ నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా ప్రారంభం అవుతాయి. మే 24వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో ప్రిలిమ్స్‌ పరీక్ష జరగనుంది. ఏదైనా విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 21నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

సీయూఈటీ పీజీ 2026 కరెక్షన్‌ విండో ఒపెన్‌.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) పీజీ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు సమయంలో ఏవైనా పొరబాట్లు చేస్తే.. వాటిని సరి చేసుకోవడానికి కరెక్షన్‌ విండోను జనవరి 30 వరకు అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ఎన్‌టీఏ ప్రకటన విడుదల చేసింది. కాగా జనవరి 23వ తేదీతో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ముగిసింది. ముగింపు సమయంలోగా దరఖాస్తుల్లో తప్పులు సవరణ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షలు దేశ వ్యాప్తంగా 276 నగరాల్లో 2026 మార్చిలో జరగనున్నాయి. మొత్తం 157 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష ఉంటుంది.

సీయూఈటీ పీజీ 2026 కరెక్షన్‌ విండో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.