తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. బ్యాక్‌లాగ్ రిజర్వుడ్ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్-2 కింద 38 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైన్సెస్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, ఎంఫిల్/ పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్/స్లెట్/సెట్‌లో వ్యాలిడ్ ర్యాంక్ కూడా ఉండాలి. సంబంధిత విభాగంలో టీచింగ్/రీసెర్చ్ అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 65 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం డైన్‌లోడ్ చేసుకన్న హార్డ్ కాపీలను కింది అడ్రస్కు నవంబర్ 17, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1000లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు.
అడ్రస్: DEPUTY REGISTRAR (RECRllTMENT), RECRUITMENT CELL, ROOM No:221, (First Floor), ADMINISTRATION BUILDING, UNIVERSITY OF HYDERABAD, PROF. C RRAO ROAD, GACHmOWLI, HYDERABAD – 500 046, INDIA.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.