UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ వర్సిటీలో పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో (గురువారం) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? విద్యార్హతలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో రీసెర్చ్ అసోసియేట్ (03), డేటాఎంట్రీ ఆపరేటర్/సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (01) ఖాళీలు ఉన్నాయి.
* రీసెర్చ్ అసోసియేట్ లో భాగంగా ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ, మెటబాలమిక్స్,ప్రొటియోమిక్స్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవంతోపాటు నాలెడ్జ్ ఉండాలి.
* డేటాఎంట్రీ ఆపరేటర్/సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ తప్పనిసరి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు నోటిఫికేషన్‌లో తెలిపిన విధంగా దరఖాస్తును నింపి y.sreelakshmi@uohyd.ac.in మెయిల్ అడ్రస్‌కు పంపించాలి.
* రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 47,000 + 24శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
* డేటాఎంట్రీ ఆపరేటర్/సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 18,000+24శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 30-12-2021 చివరి తేదీ.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..