UIDAI Recruitment 2021: ఆధార్ కార్డు సేవలను అందిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బెంగళూరు, ముంబై, గువాహతిలోని ప్రాంతీయ కార్యాలయాల్లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ప్రైవేట్ సెక్రెటరీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. డిప్యూటేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. అయితే ఈ డిప్యూటేషన్ మూడు సంవత్సరాలు పాటు ఉంటుంది. సంస్థ అవసరాలను బట్టి ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు 2021 జూలై 16 చివరి తేదీ. ఇంకా రెండు రోజుల మాత్రమే ఉంది. అయితే ఆధార్ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తుల్ని పోస్టు ద్వారా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపించాలి. మొత్తం 25 ఖాళీలు ఉండగా అందులో డిప్యూటీ డైరెక్టర్- 3, సెక్షన్ ఆఫీసర్- 5, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 5, సీనియర్ అకౌంట్ ఆఫీసర్- 1, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్- 1, అకౌంటెంట్- 2, ప్రైవేట్ సెక్రెటరీ- 6, స్టెనో- 2 పోస్టులున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే సదరు వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
ఇవీ కూాడా చదవండి