UGC NET Exam 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA ).. డిసెంబర్ 2020, జూన్ 2021 UGC NET పరీక్ష కోసం అప్లికేషన్ కరెక్షన్ విండోను తెరిచింది. సెప్టెంబర్ 7, 2021న దీనిని ఓపెన్ చేశారు. సెప్టెంబర్ 12, 2021 వరకు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు ఫారంలో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు ugcnet.nta.nic.in లో చేయవచ్చు. కరెక్షన్ విండో 12 సెప్టెంబర్, 2021న మూసివేస్తారు. తర్వాత ఎటువంటి కరెక్షన్లను NTA అనుమతించదు. దరఖాస్తు ఫారంలో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI లేదా Paytm Wallet ద్వారా అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ అవకాశం 2021 సెప్టెంబర్ 6 న లేదా అంతకు ముందు అప్లై చేసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది NTA ద్వారా పొడిగించిన ఒక సౌకర్యం మాత్రమే. అభ్యర్థులు గమనించి కరెక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
UGC NET 2021 దరఖాస్తు ఫారంలో కరెక్షన్ ఎలా చేయాలి
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in కి వెళ్లండి.
2. ఇప్పుడు మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ కావాలి.
3. మీ దరఖాస్తు ఫారం తెరపై కనిపిస్తుంది.
4. ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్న కరెక్షన్ ఎంచుకోండి.
5. ఇప్పుడు ఫారమ్‌ను సమర్పించండి.
UGC NET పరీక్ష అక్టోబర్ 6 నుంచి 8, 17 నుంచి 19 వరకు జరుగుతుందని నిర్ణయించారు. ముందుగా ఈ పరీక్ష అక్టోబర్ 6 నుంచి 11 వరకు జరగాల్సి ఉంది. అయితే ఈ మధ్యలో కొన్ని ప్రధాన పరీక్షల తేదీలు ఉండటం వల్ల NTA UGC NET పరీక్ష తేదీలను మార్చవలసి వచ్చింది.