UGC NET 2022: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జాతీయ అర్హత పరీక్ష (UGC NET 2022) ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యుజిసి నెట్ పరీక్ష 2022 జూన్ నెలలో నిర్వహిస్తామని చెప్పారు. గతంలో జరిగిన విధాంగానే UGC NET డిసెంబర్ 2021, UGC NET జూన్ 2022 పరీక్షలు ఏకకాలంలో నిర్వహిస్తామని తెలిపారు. UGC NET డిసెంబర్ 2020, UGC NET జూన్ 2021 పరీక్షలు కలిసి నిర్వహించిన సంగతి తెలిసిందే.
UGC ఛైర్మన్ M జగదీష్ కుమార్ చేసిన ట్వీట్ ప్రకారం.. ‘UGC NET డిసెంబర్ 2021, UGC NET జూన్ 2022 పరీక్షలు జూన్ మొదటి, రెండో వారంలో ఒకేసారి నిర్వహిస్తాం. పరీక్ష ఖచ్చితమైన తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో ప్రకటిస్తుంది’ UGC NET జూన్ 2022 పూర్తి షెడ్యూల్‌ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్ లో ఉంటుంది.
UGC NET ఫారమ్‌ను ఎలా పూరించాలి..?
UGC NET 2022 అధికారిక వెబ్‌సైట్ ఇంకా అప్‌డేట్ చేయలేదు. UGC 2022 ఫారమ్ ఈ వెబ్‌సైట్‌లో విడుదల అవుతుంది. ఆ తర్వాత మీరు ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. యూజీసీ నెట్ ఫీజు చెల్లింపు కూడా ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా UGC NET పరీక్ష ఆన్‌లైన్‌లో CBT మోడ్‌లో నిర్వహిస్తున్నారు.
For the merged cycles of December 2021 and June 2022, the next UGC-NET will be conducted in first/second week of June 2022. The exact schedule will be announced once NTA finalizes the dates. pic.twitter.com/nmkkfxjsoW
— Mamidala Jagadesh Kumar (@mamidala90) April 10, 2022