UGC-IUAC Recruitment 2022: బీటెక్‌/ఎమ్మెస్సీ అర్హతతో.. యూజీసీ-ఐయూఎసీలో ఉద్యోగాలు..నెలకు లక్షపైనే జీతం..

|

Feb 15, 2022 | 6:53 AM

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) పరిధిలోని ఇంటర్‌ యూనివర్సిటీ యాక్సిలరేటర్‌ సెంటర్‌ (IUAC) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

UGC-IUAC Recruitment 2022: బీటెక్‌/ఎమ్మెస్సీ అర్హతతో.. యూజీసీ-ఐయూఎసీలో ఉద్యోగాలు..నెలకు లక్షపైనే జీతం..
Ugc Iuac
Follow us on

UGC IUAC Recruitment 2022 Notification: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) పరిధిలోని ఇంటర్‌ యూనివర్సిటీ యాక్సిలరేటర్‌ సెంటర్‌ (IUAC) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 28

పోస్టుల వివరాలు:

  • ఇంజనీర్లు: 7

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధులకు సంబంధిత డిగ్రీలో మెరిట్‌ మార్కులుండాలి. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో నైపుణ్యం ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • సైంటిస్టులు-సి:14

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధులకు డిగ్రీలో మెరిట్‌ మార్కులుండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • జూనియర్‌ ఇంజనీర్లు: 5

విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరంగ్‌ డిప్లొమా ఉండాలి. అభ్యర్ధులకు డిగ్రీలో మెరిట్‌ మార్కులుండాలి. అలాగే సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.35,400ల నుంచి రూ.1,72,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 5, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Attention: CSIR-UGC NET June 2021 హాల్‌ టికెట్లు విడుదల.. ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే..