UGC re-invites applications from PwD for national fellowship: యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC) డిసేబుల్డ్ పర్సన్స్‌కు నేషనల్ ఫెలోషిప్ అందించడానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి మళ్లీ అవకాశం కల్పిస్తోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ ( DEPwD), సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2021-22 సంవత్సరానికి నేషనల్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులెవరైనా ఉంటే మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ అధికారిక వెబ్‌సైట్ ugc.ac.in/ugc_schemesలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ప్రకారం ఎంఫిల్, పిహెచ్‌డి చదువుతున్న వికలాంగులైన విద్యార్ధులకు 2021-22 విద్య సంవత్సరం కింద ఫెలోషిప్ ఇవ్వడానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఫెలోషిప్ ప్రోగ్రాంలో 200 స్లాట్‌లు ఉంటాయి. వీటిలో 15% షెడ్యూల్డ్ కులాలకు (SC), 7.5% షెడ్యూల్డ్ తెగ (ST) అభ్యర్థులకు రిజర్వేషన్ ఉంటుంది. కాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో (PG) సాధించిన మార్కుల ఆధారంగా, మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. అనంతరం తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను యూజీసీ విడుదల చేస్తుంది. దరఖాస్తులో పొందుపరచిన సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత మాత్రమే అభ్యర్ధులను ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తారు.
Also Read: