CUET in July for UG admissions in central universities: దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ అండర్ గ్రాడ్యుయేట్ (UG Courses) కోర్సుల్లో ప్రవేశాలకు మొదటిసారిగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)ను ఎన్టీఏ నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సీయూఈటీ స్కోర్ ద్వారా ఆయా యూనివర్సిటీల్లో ఈ ఏడాది యూజీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ (UGC chairman M Jagadesh Kumar) సోమవారం (మార్చి 21) మీడియాకు తెలిపారు. జులై మొదటి వారంలో సీయూఈటీ నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఐతే ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోర్ ద్వారా మాత్రమే ప్రవేశాలు కల్పిస్తామని,12వ తరగతి బోర్డు పరీక్ష మార్కులకు ఎలాంటి వెయిటేజీ ఉండబోదని, ఇంటర్ మార్కలను కేవలం అర్హత ప్రమాణంగా మాత్రమే పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇకపై సెంట్రల్ యూనివర్శిటీ అడ్మిషన్లలో 12వ తరగతి మార్కులకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదన్నారు. కొన్ని బోర్డులు చాలా ఉదారంగా మార్కులు కేటాయిస్తున్నాయని, అందువల్ల మిగతా విద్యార్ధులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా ఏ సెంట్రల్ యూనివర్సిటీలోనైనా ప్రవేశం పొందవచ్చన్నారు. అంతేకాకుండా కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్‌ను సీబీటీ (కంప్యూటరైజ్డ్ పరీక్ష) పద్ధతిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుందన్నారు. ఎగ్జామ్ ప్యాట్రన్ ఈ రోజు (మంగళవారం) ఎన్టీఏ ప్రకటిస్తుందన్నారు. ఎన్సీఈఆర్టీ12వ తరగతి సిలబస్ ఆధారంగా క్వశ్చన్ పేపర్ ఉంటుందని యూజీసీ చైర్మన్ ఈ మేరకు తెలియజేశారు.
కాగా దేశంలో యూజీసీ గుర్తింపు పొందిన 45 సెంట్రల్ యూనివర్సిటీలకు, మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష జరుతుంది. సీయూఈటీకి సంబంధించి ఎన్టీఏ రూపొందించే మెరిట్ జాబితా ఆధారంగా విద్యార్ధులకు ప్రవేశాలు కల్పిస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ, జామియా మిలియా ఇస్లామియా, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ, యూపీలోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ, బనారస్ హిందూ యూనివర్శిటీ వంటి ప్రసిద్ధ సెంట్రల్ యూనివర్సిటీలు కూడా CUET పరిధిలోకి వస్తాయి. జనరల్ సీట్లతోపాటు, రిజర్వేషన్ సీట్లను కూడా ఆయా విధానాల ప్రకారం కేటాయిస్తామని, ఐతే ఇందుకు ఎలాంటి కౌన్సింగ్ ఉండబోదన్నారు.
సీయూఈటీ వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులకు సమాన అవకాశాలు కల్పించడానికి ఉపయోగపడుతుందని, విద్యార్ధుల తల్లిదండ్రులపై ఆర్ధికభారం తగ్గిస్తుందన్నారు (విడివిడిగాకాకుండా ఒకే పరీక్ష ద్వారా ప్రవేవాలు పొందవచ్చు). ఐతే రాష్ట్ర యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్శిటీలు కూడా తమకు కావాలంటే సీయూఈటీ స్కోర్‌ల ఆధాకంగా అడ్మిషన్లు చేపట్టవచ్చిన యూజీసీ చైర్మన్ ఎమ్ జగదీష్ కుమార్ తెలిపారు.
Also Read: