TTD Junion College Online Admission 2021-22: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను అడ్మీషన్స్ కోసం సెప్టెంబరు 22వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హత గల విద్యార్థులు https://admission.tirumala.org వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని టీటీడీ కోరింది. సెప్టెంబరు 22 నుండి అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రతులను కళాశాల వద్ద సమర్పించవలసిన అవసరం లేదని టీటీడీ తెలియజేసింది. ఆ మేరకు టీటీడీ అధికారులు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, హెచ్‌టీసీ, జీఈహెచ్, సీఈఎల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.
Also Read..
GATE 2022: ఇంజనీరింగ్ విద్యార్థులు అలర్ట్..! GATE చివరితేది ఎప్పుడంటే..?
పండగ సీజన్‌లో రుణాలపై హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన.. రుణ గ్రహీతలకు అదిరిపోయే ఆఫర్..!