TSWR Sainik School: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలు 2023-24.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Jan 31, 2023 | 8:25 PM

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యసంవత్సరానికి ఇంటర్మీడియట్‌ (11వ తరగతి)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు..

TSWR Sainik School: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలు 2023-24.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
TSWR Sainik School
Follow us on

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యసంవత్సరానికి ఇంటర్మీడియట్‌ (11వ తరగతి)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 80 సీట్ల భర్తీకి అర్హులైన బాలుర నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఎంపీసీ కోర్సులో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు చేసుకోవాలంటే 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిన లేదా పరీక్షలకు హాజరయ్యే బాలురు మాత్రమే అర్హులు. తెలుగు/ఇంగ్లిష్‌ మీడియం చదువుతున్న విద్యార్థులు అర్హులు. అలాగే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలోనైతే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.లక్షన్నరకు మించకూడదు. విద్యార్ధుల వయసు ఏప్రిల్‌ 1, 2023 నాటికి 16 ఏళ్లకు మించకుండా ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2007 నుంచి మార్చి 31, 2009 మధ్య జన్మించి ఉండాలి.

ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ రూ.200లు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మూడు స్టేజుల్లో (స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, స్క్రీనింగ్ టెస్టులు, వైద్య పరీక్షల ఆధారంగా) విద్యార్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జనవరి 31, 2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2023.
హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ తేదీ: ఫిబ్రవరి 17, 2023 నుంచి..
ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 26, 2023.
రాత పరీక్ష ఫలితాల విడుదల తేదీ: మార్చి 8, 2023.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తేదీలు: 2023, మార్చి 10, 12, 14, 18, 19
ఫలితాల ప్రకటన తేదీ: మార్చి 28, 2023.
ప్రవేశాలు ప్రారంభం: మార్చి 30, 2023.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.