10th Class Time Table 2026: ‘రెండో శనివారం పరీక్షా? సెలవు ఇవ్వాల్సిందే..’ టెన్త్ టైం టేబుల్‌పై రచ్చరంబోలా!

రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 టైం టేబుల్‌ తాజాగా పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. తొలుత ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ..

10th Class Time Table 2026: రెండో శనివారం పరీక్షా? సెలవు ఇవ్వాల్సిందే.. టెన్త్ టైం టేబుల్‌పై రచ్చరంబోలా!
Telangana Class 10 Public Examination Timetable

Updated on: Dec 11, 2025 | 6:39 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 11: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 టైం టేబుల్‌ తాజాగా పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. తొలుత ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. అయితే సీబీఎస్సీ టైం టేబుల్‌ మాదిరి ఈసారి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు కూడా ఒక్కో పరీక్షకు మధ్యలో భారీగా సెలవులు రావడం విశేషం. విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ మేరకు స్పెషల్‌గా విద్యాశాఖ అధికారులు టైం టేబుల్ రూపొందించారు. అయితే ఇందులో తొలి పరీక్ష మార్చి 14న ప్రారంభం అవనుంది. అయితే సరిగ్గా రెండో శనివారం కావడంతో సెలవు రోజు పరీక్ష పెట్టడంపై టీచర్లతోపాటు విద్యార్ధుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని టీచర్స్‌, విద్యార్థి సంఘాలు బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నికోలస్‌ను కలిసి వినతి అందజేశారు.

టైం టేబుల్ అశాస్త్రీయంగా ఉందని, ఏడు పేపర్లు రాయడానికి దాదాపు 35 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం అనవసరమని, దాన్ని సవరించాలని ఈ వినతి పత్రంలో తెలిపారు. అధికారుల వ్యక్తిగత అభిప్రాయాన్ని రుద్దినట్లుగా ఈ టైం టేబుల్‌ ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి వెంకట్‌ పేర్కొన్నారు. రెండు పరీక్షల మధ్య ఒక రోజు విరామం ఇస్తే సరిపోతుందని, పేపర్ల మధ్య 4-5 రోజుల టైమ్‌తో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మానసిక ఆందోళన, ఒత్తిడి పెరుగుతుందని అభ్యంతరం తెలిపారు. అలాగే ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలను భద్రపరచడంలో సమస్యలు తలెత్తుతాయి. పేపర్ల మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశమం ఉంటుంది. ఏప్రిల్‌ 23 చివరి పనిదినం. పది పరీక్షలు ఏప్రిల్‌ 16న ముగిస్తే 6 నుంచి 9 తరగతులకు పరీక్షలెప్పుడు పెట్టాలని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పదో తరగతి టైం టేబుల్‌ను మార్చాలని ట్రస్మా నేతలు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ను కోరారు. ఈ మేరకు ఎస్‌టీయూటీఎస్‌ నేతలు కూడా వినతిపత్రం అందజేశారు.

ఇవి కూడా చదవండి

పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 టైం టేబుల్‌ ఇదే..

  • 14 మార్చి 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
  • 18 మార్చి 2026 – సెకెండ్ లాంగ్వేజ్
  • 23 మార్చి 2026 – థర్డ్ లాంగ్వేజ్
  • 28 మార్చి 2026 – మాథెమాటిక్స్
  • 02 ఏప్రిల్ 2026 – ఫిజికల్ సైన్స్
  • 07 ఏప్రిల్ 2026 – బయోలాజికల్ సైన్స్
  • 13 ఏప్రిల్ 2026 – సోషల్ స్టడీస్

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.