TSRJC CET 2022 Exam Date: తెలంగాణ జూనియర్ రెసిడెన్షియల్ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ఆర్జేసీ సెట్ 2022 పరీక్ష నిర్వహణ తేదీ విడుదలైంది. జూన్ 6వ తేదీన ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు సిద్దిపేట, సంగారెడ్డిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 గంటల వరకు పరీక్ష జరుపుతామని కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 40,281 మంది దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను మే 28వ తేదీ నుంచి www.tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
కాగా 2022-23 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ, ఎమ్‌ఈసీ కోర్సుల్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాల కోసం TSRJC CET 2022 నిర్వహిస్తోంది. 2021-22 పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 30తో ముగిసింది. ఈ పరీక్షకు సంబంధించిన ఇతర పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ http://tsrjdc.cgg.gov.inలో తనిఖీ చేసుకోవచ్చు.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.