TSPSC Jobs: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం.

|

Dec 23, 2022 | 7:18 PM

వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ వస్తోన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణలోని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ నియంత్రణలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ..

TSPSC Jobs: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందే అవకాశం.
Horticulture Officer Posts
Follow us on

వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ వస్తోన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణలోని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ నియంత్రణలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఈ పోస్టులకు ధరఖౄస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ(హార్టికల్చర్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు జీతంగా చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 03-01-2023 మొదలై 24-01-2023తో ముగియ నుంది.

* పరీక్షను 04-04-2023 తేదీన నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

* మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..