TSPSC Recruitment 2022: తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌! 833 ఇంజనీర్‌, టెక్నికల్ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..

|

Dec 08, 2022 | 2:34 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) .. 833 అసిస్టెంట్ ఇంజినీర్‌ (434), జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (399) పోస్టుల భర్తీకి (Assistant Engineer Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

TSPSC Recruitment 2022: తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌! 833 ఇంజనీర్‌, టెక్నికల్ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..
Tspsc
Follow us on

TSPSC Assistant Engineer & Technical officer Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) .. 833 అసిస్టెంట్ ఇంజినీర్‌ (434), జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (399) పోస్టుల భర్తీకి (Assistant Engineer Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌, పబ్లిక్‌హెల్త్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఇరిగేషన్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 21, 2022వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులకైతే నెలకు రూ.45,960ల నుంచి రూ.1,24,150ల వరకు చెల్లిస్తారు. ఇక జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు నెలకు రూ.32,810ల నుంచి రూ.96,890ల వరకు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.