తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో.. 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద దాదాపు 19 సబ్జెక్టుల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఏడాది జులై 23వ తేదీన ఆర్థిక శాఖ అనుమతి తెల్పిన విషయం తెల్సిందే.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ బీఈ/బీటెక్/బీఎస్/పీజీ/బీఆర్క్/బీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జులై 1, 2004 నుంచి జులై 2, 1978 తేదీల మధ్య జన్మించి ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 4, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మే/జూన్ 2023 నెలల్లో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.1,82,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.