TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌.. నేటి నుంచి గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. ఇలా అప్లై చేసుకోండి.

|

Dec 30, 2022 | 7:20 AM

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నోటిఫికేషన్స్‌ విడుదలవుతున్నాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్‌ విడుదల చేసింది. తాజాగా గ్రూప్‌2 భర్తీకి కూడా నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి..

TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌.. నేటి నుంచి గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. ఇలా అప్లై చేసుకోండి.
TSPSC
Follow us on

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నోటిఫికేషన్స్‌ విడుదలవుతున్నాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్‌ విడుదల చేసింది. తాజాగా గ్రూప్‌2 భర్తీకి కూడా నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి (శుక్రవారం) ప్రారంభంకానుంది. నిజానికి గ్రూప్‌ 4 దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్‌ 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల డిసెంబర్‌ 30వ తేదీ నుంచి గ్రూప్‌ 4 ఉద్యోగుల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణకు జనవరి 19వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

ఇక గ్రూప్‌-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 1,862 వార్డు అధికారుల పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా అయితే.. 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూశాఖలో 2,077 , సీసీఎల్‌ఏ పరిధిలో 1,294, సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులు ఉన్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, జూనియర్‌ అకౌంటెంట్‌ 429, జూనియర్‌ ఆడిటర్‌ 18, వార్డు అధికారుల పోస్టులు 1,862 భర్తీ చేయనున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్స్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 6 నుంచి 7 లక్షల మంది ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..