TSPSC Notification: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.. కీలక ప్రకటన చేసిన టీఎస్‌పీఎస్సీ..

|

Mar 31, 2021 | 10:37 AM

TSPSC Notification: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్‌బీవో) పోస్టుల భర్తీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ నియామక సంస్థ టీఎస్‌పీఎస్సీ..

TSPSC Notification: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.. కీలక ప్రకటన చేసిన టీఎస్‌పీఎస్సీ..
Tspsc Notification
Follow us on

TSPSC Notification: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్‌బీవో) పోస్టుల భర్తీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ నియామక సంస్థ టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఎఫ్‌బీవో పోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థులకు ఏప్రిల్ 6వ తేదీన నడక పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి శాంతివనం పార్క్‌లో ఉదయం 5 గంటలకు నడక పరీక్ష ప్రారంభమవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధిన పూర్తి వివరాల కోసం టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని స్పష్టం చేశారు.

కాగా, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌బీవో) పోస్టుల భర్తీ కోసం గతేడాది అక్టోబర్ నెలలో మూడో విడత నడక పరీక్ష నిర్వహించారు. ఈ నడక పరీక్షలో 390 మంది అభ్యర్థులు అర్హత సాధించారని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. నాలుగో విడత అర్హత పరీక్షకు రాత పరీక్షలో మెరిట్‌ ప్రకారం 823 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని, త్వరలోనే తేదీలను ప్రకటించి.. అటవీశాఖ ఆధ్వరంలో నడక పరీక్షలను నిర్వహిస్తామని గతంలో పేర్కొంది. దాని ప్రకారం.. తాజాగా ఎఫ్‌బీవో పోస్టుల భర్తీకి నాలుగో విడత నకడ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్‌సీ సిద్ధమైంది.

Also read:

Telangana Temperature: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ వార్నింగ్.. ఆ టైమ్‌లో అస్సలు బయటకు వెళ్లకండి..

Benefits of Rice water: అన్నం ఉడికిన తర్వాత గంజి పారబోస్తున్నారా..? ఈ ప్రయోజనాలు తెలిస్తే చుక్క కూడా వేస్ట్ చెయ్యరు

Aadhar Card: పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేశారా ? ఈరోజే లాస్ట్ .. మిస్ చేసారో ఇక అంతే సంగతులు..